‘సర్’ పై మరోసారి ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ

Spread the love

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మరోసారి ఘాటుగా స్పందించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈ  కార్యక్రమం వల్ల ఒత్తిడి భరించలేక రోజుకు ముగ్గురు నలుగురు ఓటర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంతవరకు మొత్తం 110 మంది మరణించారని.. ఆత్మహత్యాయత్నం చేసి హాస్పిటల్ లో  40-45 మంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని మమత పేర్కొన్నారు. ఇంతవరకు 1.38 కోట్లమంది ఓటర్లను సర్ విచారణకు పిలిచారన్నారు.  ఇప్పటికే లక్షల మంది పేర్లు తొలగించారని ఆమె వెల్లడించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా నిన్న కోల్ కతా లో జరిగిన కార్యక్రమంలో మమతా ప్రసంగించారు. నేతాజీ ఇప్పుడు బతికి ఉంటే ఆయన పౌరసత్వాన్ని కూడా సందేహించేవారని కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. .