అహ్మదాబాద్ విమాన దుర్ఘటన..ఎయిర్ ఇండియాకు ఇన్సూరెన్స్ నగదు 

Spread the love

అహ్మదాబాద్ లో గత సంవత్సరం చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా ఘోర విమానప్రమాదం గురించి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంకు  సంబంధించి ఎయిర్ ఇండియాకు పలు ఇన్సూరెన్సు కంపెనీలు, రీ ఇన్సూరెన్స్ ల నుంచి పరిహారం అందినట్లు తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ కు రూ.1100కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఈమేరకు ఒక ఇంగ్లీష్ మీడియా కథనం తెలిపింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు, రీఇన్సురర్లు 125 మిలియన్ డాలర్లు ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించాలి. అలాగే ఈ యాక్సిడెంట్ లో మరణించిన వారి కుటుంబాలకు 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియ కూడా మొదలైనట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఇక మరోవైపు ఈ విమానం పడిన హాస్టల్ లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేలా టాటా గ్రూప్ ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజీని పునరుద్ధరించడం, సమీపంలో విమాన శకలాల వలన దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం కోసం ఆ ట్రస్ట్ ఫండ్స్ ఉపయోగిస్తున్నారు.