రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం..భారీ ఉగ్రకుట్ర భగ్నం

Spread the love

ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్ర దాడులకు ప్రణాళికలు వేస్తున్న అంతర్జాతీయ ముఠాను పంజాబ్ లో పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం గాలింపు చర్యలు చేపట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఖలిస్థాన్ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటెర్నేషల్ ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.5కిలోల ఆర్దీఎక్స్ ను భారీ స్థాయిలో వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు వారు కుట్ర పన్నినట్లు తెలిపారు. పట్టుకున్న నిందితులను శరణ్ ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్ సైని, అర్ష్ దీప్ సింగ్, అజయ్, హర్మాన్ లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఉగ్రముఠాను అమెరికాకు చెందిన బబ్బర్ ఖల్సా హ్యాండ్లర్ల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి ఆదేశాలతోనే నిందితులు వివిధ ప్రాంతాలలో దాడులకు ప్లాన్లు వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.