మొన్నే కదా మన మెగాస్టార్ 70 ఏళ్ళ వయసులో మన శంకర వర ప్రసాద్ సినిమా లో ఎంతలా ఎంటర్టైన్ చేసాడో… అబ్బో చంపేశాడు అని అనుకున్నాము. ఐతే మన టాలీవుడ్ లోనే కాదు, అటు మలయాళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ వయసు హీరోల దే హవా… వాళ్లెవరో చెప్పక్కర్లేదు అనుకుంట… ఇంకెవరు మోహన్ లాల్, మమ్మూటీ…మలయాళ చిత్ర పరిశ్రమకు రెండు బలమైన స్తంభాల్లా నిలిచిన మమ్ముట్టి, మోహన్‌లాల్… వయసు పెరుగుతున్నా, వారి ప్రతి ఏడాది చేసే సినిమాల సంఖ్య కూడా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు…అలాగే తమ వయసుకు తగ్గ పాత్రల్లో కొత్తదనాన్ని చూపిస్తూ, అవకాశాల విషయంలో ఇంకా ముందంజలోనే ఉన్నారనే భావనను మరోసారి బలపరిచారు. 2025 డిసెంబరు చివర్లో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇద్దరు అగ్ర నటులు, అప్పుడే కొత్త చిత్రాలకు శ్రీకారం చుట్టడం విశేషం. పైగా ఇవి క్రేజీ కాంబినేషన్లలో రూపొందుతుండటంతో, మలయాళ సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘పాదయాత్ర’ రూపొందుతోంది. ఇక మమ్ముట్టి గతేడాది విషయానికి వస్తే… ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, ‘బజూక’, ‘కలాంకావల్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ‘కలాంకావల్’ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మరోవైపు మోహన్‌లాల్ – దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్లో గతేడాది వచ్చిన ‘తుడరుమ్’ మలయాళ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.235 కోట్ల వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అదే విజయవంతమైన కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమా L366 షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.2025లో మోహన్‌లాల్ వరుసగా ‘తుడరుమ్’, ‘ఎల్2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘హృదయపూర్వం’, ‘వృషభ’ వంటి సినిమాల్లో కనిపించారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన ‘దృశ్యం 3’, ‘పేట్రియట్’ వంటి ప్రాజెక్టుల్లో నటించనున్నారు.మొత్తంగా చుస్తే, ఈ ఏడాది కూడా మమ్మూటీ మోహన్ లాల్ ఇద్దరు మూడు పైగా సినిమాలతో బిజీ గా ఉన్నారు.