ఏఐ ఇంపాక్ట్ సదస్సు:చైనీస్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు

Spread the love

కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం AI సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా,  భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు మోదీ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రస్తుతం జరుగుతున్న AI సదస్సులో, చైనా రోబోలను మనవిగా ప్రదర్శిస్తున్నారు. దీనిపై చైనా మీడియా మనల్ని ఎగతాళి చేస్తోంది, ఇది నిజంగా భారత్‌కు తలవంపులు తెచ్చే విషయమని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన దగ్గర ఉన్న డేటా శక్తితో AI రంగంలో ప్రపంచానికే నాయకత్వం వహించగలిగే అవకాశం ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వం ఈ రంగాన్ని ఒక జోక్‌లా మార్చేసి దేశ ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చిందని పేర్కొంది. ఇక ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. భారతదేశ ప్రతిభను మరియు డేటాను సద్వినియోగం చేసుకోవడానికి బదులుగా, ఈ AI సదస్సు ఒక అస్తవ్యస్తమైన PR ఆర్భాటంగా మారిందని విమర్శించారు.  ఇక్కడ భారతీయ డేటా అమ్మకానికి ఉంది మరియు చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *