అస్సాం ఎన్నికలు..88 మందితో తొలి  జాబితా విడుదల చేసిన  బీజేపీ

Spread the love

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసే 88 రాష్ట్ర అభ్యర్థుల పేర్లతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం అక్కడ 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన లిస్టులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జాలుక్ బారీ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేస్తున్నారు. 2001, 2006, 2016,2021లలో ఈ స్థానం నుండే హిమంత బిశ్వ శర్మ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఆయనకు కంచుకోట లాంటిదని చెప్తారు. అస్సాం కాంగ్రెస్ విపక్ష నేత గౌరవ్ గొగొయ్ పోటీ చేస్తున్న  జోర్హాట్ నియోజకవర్గం లో బీజేపీ తరపున  సిటింగ్ ఎంపీ హితేంద్రనాథ్ గోస్వామిని రంగంలోకి దించారు. ఇక అస్సాం లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *