బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Spread the love

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ కీలక టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం చేపట్టిన ‘మిషన్ 2026’ కార్యక్రమాన్ని అమిత్ షా  ఈ సందర్భంగా ప్రారంభించారు. కేరళలో బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి కేరళను రక్షించడంతో పాటు శతాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న విశ్వాసాలను  కాపాడేందుకు కృషిచేయాలన్నారు. ఈ మూడింటిని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లు పూర్తి చేయలేవని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే ఇది సాధ్యమని అమిత్ షా పేర్కొన్నారు.

ఇక శబరిమల బంగారం తాపడాల కేసు విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్ పై అమిత్ షా ఫైర్ అయ్యారు.  ఈ కేసు విచారణను న్యూట్రల్  దర్యాప్తు సంస్థ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శబరిమల ఆలయంలోని ఆస్తులను కాపాడడంలో విఫలమైన వారు ప్రజల నమ్మకాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. శబరిమల బంగారం చోరీ సమస్య కేవలం కేరళ ప్రజలది మాత్రమే కాదని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరిది. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను  గమనిస్తే నిందితులను రక్షించేందుకే రూపొందించినట్లుగా ఉందని దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడమే కాదు. ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.