“ధ్రువ్ NG” ఆత్మనిర్భర భారత్ దిశగా మరో కీలక మైలురాయి

Spread the love

HAL (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) రూపొందించిన అడ్వాన్స్‌డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ “ధ్రువ్ NG” తొలి పరీక్షా విమానం ఆత్మనిర్భర భారత్ దిశగా మరో కీలక మైలురాయి అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భారతీయ పౌర విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక “లిఫ్ట్ ఆఫ్”కు నేడు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 

పౌర, వాణిజ్య అవసరాల కోసం పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా రూపొందిన ఈ రోటరీ వింగ్, మన దేశీయ ఇంజినీరింగ్ ప్రతిభకు గర్వకారణం. ప్రపంచ స్థాయి హెలికాప్టర్లను డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, తయారు చేసే సామర్థ్యాన్ని భారత్ మరోసారి చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ “ఇంపోర్ట్ డిపెండెన్సీ” నుంచి “ఇండిజెనస్ రిలయబిలిటీ” వైపు దృఢంగా అడుగులు వేసిందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దేశీయ శక్తి ఇంజిన్‌తో కూడిన ధ్రువ్, గ్లోబల్ విమానయాన తయారీ హబ్‌గా భారత్ ఎదుగుదలకు మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు.