తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు: శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

Spread the love

కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఈరోజు తెల్లవారుజామున 1:30 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జరిగిన స్వర్ణ రథోత్సవంలో మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8, 2026 వరకు పది రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనున్నాయి.మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30 – జనవరి 1) కేవలం ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా, జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్లు,ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్న సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలుగనుంది.