భారతదేశ ఇంధన సరఫరా పూర్తి సురక్షితంగా మరియు స్థిరంగా ఉందని మరోసారి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ (LPG) కొరత లేదని అన్ని రీటైల్ అవుట్లెట్లు తగినంత స్టాక్‌తో సాధారణంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. తప్పుడు సమాచారం మరియు భయాందోళన కలిగించే కథనాలు పూర్తిగా నిరాధారమైనవని పౌరులు అధికారిక వనరులను మాత్రమే నమ్మాలని మరియు పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించింది.. ప్రతి పౌరుడికి నిరంతరాయంగా ఇంధనం అందేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ఇటీవల వ్యాప్తి చెందిన పుకార్లతో పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద క్యాన్లతో పలువురు పెట్రోల్ తీసుకువెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంధన కొరత లేకపోయినప్పటికీ పలు చోట్ల వదంతులు వస్తుండడంతో కేంద్రం స్పష్టతనిస్తూ వస్తోంది. ఫ్యూయల్ సప్లైకు కొరత లేదని తెలిపింది.