అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోడీ సమావేశం

Spread the love

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ప్రధాని మాట్లాడనున్నారు. ఇక ఇటీవల పార్లమెంట్ లో ప్రసంగిస్తూ మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై మాట్లాడిన విషయం తెలిసిందే. యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల గురించి మాట్లాడారు. సంక్షోభం నుండి బయటపడాలంటే రాష్ట్రాలన్నీ కలిసి ఒక టీమ్ లా పనిచేయాలన్నారు. ఇది పరీక్షా సమయమని ప్రజలను కూడా సమాయత్తయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ (LPG) సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటం. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *