పోలీసు పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

Spread the love

రిపబ్లిక్ డే  పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు మెడల్స్ ను  ప్రకటించింది. దేశవ్యాప్తంగా 982 మందికి సాహస మెడల్స్  అందజేయనుంది. ఈ మేరకు ఈనెల 25న  అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 125 సాహస పతకాలు, 101 రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 756 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాల(మెడల్ ఫర్ మెరటోరియస్ సర్వీస్)ను ప్రకటించారు. సాహస పతకాలు దక్కించుకున్న వారిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ లో  విధులు నిర్వహిస్తోన్న 33 మంది పోలీసులున్నారు. ఈ లిస్ట్ లో మహారాష్ట్ర 31 పతకాలు, ఉత్తర్ ప్రదేశ్ 18, ఢిల్లీ 14 పతకాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, 31 మంది సీబీఐ అధికారులూ పోలీసు మెడల్ దక్కించుకున్నారు.