ఎటువంటి వివక్షకూ తావులేకుండా అన్ని మతాల కార్యక్రమాల్లో పాల్గొంటానని, తాను అసలైన లౌకికవాదినని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నానంటూ వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. తాము మతాలను, కులాలను అభిమానిస్తామని ఆమె పేర్కొన్నారు. మానవత్వమే మా భావజాలం అని స్పష్టం చేశారు. కోల్ కతా లోని న్యూ టౌన్ లో దుర్గామాతకు అంకితమైన ‘దుర్గా ఆంగన్’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ప్రజల్ని అనవసరంగా వేధిస్తున్నారని మమత ఆరోపించారు.