పాలిటిక్స్ అంటే సినిమా స్క్రిప్ట్ కాదు…దళపతికి శ్రీలంక ఎంపీ హితవు..!

Spread the love

తమిళ సూపర్ స్టార్, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, దళపతి విజయ్ రాజకీయ ప్రయాణంపై శ్రీలంక ఎంపీ నామల్ రాజపక్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయం అనేది సినిమా స్క్రిప్ట్ కాదు.. ఇక్కడ సమస్యలు, పరిష్కారాలు అన్నీ వాస్తవికంగా ఉంటాయి” అని ఆయన విజయ్‌కు హితవు పలికారు. వెండితెరపై హీరోగా విజయ్ తనకు ఎంతో ఇష్టమని పేర్కొంటూనే, రాజకీయాల్లో విశ్వసనీయత సంపాదించుకోవాలంటే కేవలం మాటలు సరిపోవని, క్షేత్రస్థాయిలో పనితీరు ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా విజయ్ ప్రస్తావించిన కచ్చతీవు అంశంపై స్పందిస్తూ..అది రెండు దేశాల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందమని, అది శ్రీలంకలో భాగమని స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం వెతకాలే తప్ప, పాత రాజకీయ వైరుధ్యాలతో శ్రీలంకను చూడకూడదని..భారత్, తమిళనాడులు శ్రీలంకను ఒక అభివృద్ధి భాగస్వామిగా చూడాలని రాజపక్స కోరారు.