కమర్షియల్ కోటా గ్యాస్ సప్లై పెంపు..కేంద్రం కీలక నిర్ణయం

Spread the love

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ఎఫెక్ట్ మన దేశంలో కమర్షియల్ సిలిండర్ల మీద పడిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎల్.పీ.జీ సప్లైకు సంబంధించిన కోటాను కేంద్రం ఇటీవల తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో 50 శాతంగా సప్లైను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ లెటర్ రాశారు. ఇక స్టీల్, ఆటోమొబైల్, కెమికల్స్, పెయింట్స్, ప్లాస్టిక్, వస్త్రాలు వంటి కీలక శాఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40 శాతంగా ఉన్న కేటాయింపులను మరో 10 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం వల్ల బిజినెస్ సెక్టార్లకు  ఊరట లభించనుంది. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *