అదే ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ స్పెషలిటీ..!

Spread the love

ప్రపంచంలోనే మొట్ట మొదటిది అలాగే ఏకైక  ఫ్లోటింగ్  పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో  తెలుసా? అది కూడా మన దేశంలోనే కావడం విశేషం. అది మరెక్కడో కాదు భారత్ లోనే భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ‘దాల్ లేక్’ (Dal Lake) లో ఉంది. ఇది ఒక పెద్ద హౌస్‌బోట్‌లో ఉంటుంది. దీనిని ఆగస్టు 2011లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం  ఉమర్ అబ్దుల్లా మరియు కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ప్రారంభించారు. అంతకుముందు కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉన్నప్పటికీ, దానిని ఒక పక్కా పద్ధతిలో ఆధునికీకరించి ‘ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్’ గా మార్చారు. ఇది కేవలం లెటర్స్ పంపించడానికి మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు మరియు పర్యాటకులకు బ్యాంకింగ్ సర్వీసెస్  కూడా అందిస్తుంది. ఇక  ఈ పోస్ట్ ఆఫీస్ నుండి  వెళ్ళే ఉత్తరాలపై వేసే పోస్ట్ మార్క్ లో ఒక పడవ నడుపుతున్న వ్యక్తి చిత్రం ఉంటుంది. ఇంకా దీని లోపల ఒక చిన్న పోస్టల్  మ్యూజియం కూడా ఉంది, అక్కడ పాత కాలపు అరుదైన స్టాంపులు మరియు పోస్టల్ హిస్టరీకి కు సంబంధించిన ఫోటోలను చూడవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *