ఇస్రో మరో కీలక ముందడుగు..SSLV థర్డ్ స్టేజ్ టెస్ట్ విజయవంతం

Spread the love

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్  (ఇస్రో) మరో కీలక ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) థర్డ్ స్టేజ్   (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ సెంటర్ లో ఈరోజు ఈ ప్రయోగం జరిపింది.  మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో తెలిపింది. స్పేస్ లోకి  చిన్న శాటిలైట్ లను  వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు.ఎక్కువ  స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్ కు  సెకనుకు 4 కి.మీ వేగాన్ని అందించడంలో ఎస్ఎస్-3 కీలక పాత్ర పోషిస్తుంది. పేలోడ్ సామర్థ్యాన్ని సుమారు 90 కిలోల వరకు మెరుగుపరుస్తుందన్నారు. ప్రస్తుతం చేసిన అప్గ్రేడ్లు ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ డిజైన్ శాటిలైట్ కెపాసిటీ, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ప్రెజర్, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు తెలిపారు.