బీహార్ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలోని అర్హత కలిగిన మహిళల అకౌంట్ల లోకి రూ.10 వేల చొప్పున నగదు నేరుగా జమ చేశారు. తమ అకౌంట్లల్లో డబ్బు పంపించిన నేపథ్యంలో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శివరాత్రి కూడా కావడంతో మహిళలకు శివరాత్రి బహుమతి అందించినట్లు చెప్పుకుంటున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాగే మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసి బీజేపీ-జేడీయూ కూటమికి భారీ మద్దతు తెలిపారు. ఫలితంగా ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుంది. నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు శివరాత్రి పండుగ సమయంలో మళ్లీ ఖాతాల్లో రూ.10 వేలు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళల సంక్షేమం విషయంలో నితీశ్ ఎప్పుడూ ముందుంటారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.