ఈ సంస్కరణలకు మన యువ శక్తే కేంద్ర బిందువు:ప్రధాని మోదీ 

Spread the love

అపార క్రీటివిటీ, వినూత్న ఆలోచనలు జెనరేషన్-జీ సొంతమని, అద్భుతమైన  శక్తి, సంకల్ప బలం వారిలో ఉందని, నేషన్ బిల్డింగ్ లో వారు ముందంజలో ఉన్నారని నరేంద్ర ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువత, స్టార్టప్ విప్లవాలపై దృష్టి పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం విజయవంతమైన పథకాలను తీసుకొచ్చిందని, అవి దేశానికి ఒక సరికొత్త ఉత్సాహాన్ని అందించాయని తెలిపారు. తాజాగా ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ, విదేశాలకు చెందిన యువతీయువకులతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామీ వివేకానందను గుర్తు చేసుకుంటూ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఆయన నుంచి స్ఫూర్తి పొందే ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను ఏర్పాటు చేశామని  ప్రధాని తెలిపారు. గత దశాబ్ద కాలంగా వరుసగా చేపట్టిన సంస్కరణలు ప్రస్తుతం సంస్కరణల ఎక్స్ ప్రెస్ గా డెవలప్ అయ్యాయని ఈ రీఫార్మ్స్  మన యువ శక్తే కేంద్ర బిందువని మోదీ స్పష్టం చేశారు.