భారత్-అమెరికాల మధ్య టారిఫ్ ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గింపు వర్తించనుంది. ప్రధాని నరేంద్రమోడీ ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాన్నీ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల భారత ప్రజల తరపున ప్రెసిడెంట్ ట్రంప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, అది మన ప్రజలకు మేలు చేయడమే కాకుండా, పరస్పర సహకారం కోసం అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఆయనతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.