భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం

Spread the love

భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రానుంది. క్రీడాకారుల ట్రైనింగ్, డైటింగ్, వారి గాయాల అంచనా వయసును నిర్దారించడం వంటి కీలక అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలకపాత్ర పోషించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ లో దేశంలోనే మొదటిసారిగా అథ్లెట్ మేనేజ్మెంట్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఐఐటీ బాంబే భాగస్వామ్యంతో నాస్కామ్ డీప్ టెక్ స్టార్టప్ ‘డార్విన్’ దీనిని డెవలప్ చేసింది. ప్రస్తుతానికి ఈ సిస్టమ్ టాప్ రేంజ్ అథ్లెట్లకు మాత్రమే సేవలందిస్తున్నప్పటికీ రానున్న కాలంలో జూనియర్ రేంజ్ కు విస్తరించనున్నారు. ఫలితంగా ‘cathc them young’ లక్ష్యం సాకారమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. క్రీడాకారుల రోజు వారీ జీవితాల్లో వారి ట్రైనింగ్, ఆహార పద్ధతులకు  సంబంధించిన వివరాలను కూడా కోచ్ లు క్రీడా నిపుణులు పర్యవేక్షించవచ్చు. ఇంకా అనేక కీలక విషయాలపై క్రీడాకారులకు ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది.