ప్రధాని మోడీ మలేసియా పర్యటన..కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని

Spread the love

ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మలేసియా చేరుకున్నారు. మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు  మలేషియాలో పర్యటిస్తున్నారు. భారతదేశానికి మలేషియాతో మంచి  మరియు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటన మా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ (Comprehensive Strategic Partnership) మరింత ప్రోత్సహిస్తుంది మరియు వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందిస్తుందని పర్యటనకు ముందు ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  మలేషియాలో శక్తివంతమైన ప్రవాస భారతీయులు  నివసిస్తున్నారు. ఈ రోజు కౌలాలంపూర్‌లో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని, అక్కడ ఉన్న మన భారతీయ సంతతి వారితో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కౌలాలంపూర్‌ చేరుకున్న భారత ప్రధాని మోడీకి విమానాశ్రయంలో మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. వీరిరువురు మధ్య కీలక చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. భారతదేశం మరియు మలేషియాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.