టీ 20 వరల్డ్ కప్: భారత క్రికెట్ జట్టుకు అదొక సవాలు:రోహిత్

Spread the love

ఫిబ్రవరి 7 నుండి భారత్, శ్రీలంకల వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ 20 ఫార్మాట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ తేలికగా సెమీ ఫైనల్ చేరుతుందని క్రికెట్ విశ్లేషకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్ కు కొన్ని ఛాలెంజ్ లు ఎదురయ్యే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కు కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది టీమ్ లోకి తీసుకోవడంలో సవాలుగా ఉంటుందన్నాడు. వీరిద్దరినీ టీమ్ లో ఆడించాలంటే భారత్ ఇద్దరు సీమర్లతోనే బరిలోకి దిగాల్సిఉంటుంది. ఇది పెద్ద సవాలని రోహిత్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ విషయంలో ఫిక్స్డ్ డ్ రూల్స్ అంటూ ఏమీ ఉండవు. కోచ్, కెప్టెన్ ఆలోచనలను బట్టి జట్టు కూర్పు ఉంటుందని రోహిత్ అభిప్రాయం వ్యక్తంచేశాడు. అలాగే మంచు (Dew Factor) కూడా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను  తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని రోహిత్ అన్నాడు.