రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలి.. వీధి కుక్కల అంశంపై మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు 

Spread the love

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరోసారి వీధి కుక్కల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కుక్కల సమస్యను కంట్రోల్ చేయని పక్షంలో ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని పేర్కొంది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కుక్క కరిచిన ప్రభావం సదరు వ్యక్తిపై జీవితాంతం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇక ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహరం పెట్టే వారిపైన కూడా తగిన రీతిలో స్పందించింది. మీకు కుక్కల పై అంత ప్రేమ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. కుక్కల సమస్య భావోద్వేగ అంశమని అంటున్నారు. కేవలం కుక్కల మీద మాత్రమే భావోద్వేగమా? తాము మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళనం చెందుతున్నట్లు పేర్కొంది. వీధుల్లో తిరుగుతూ మనుషులను భయాందోళనలకు గురిచేసే పరిస్థితిని ఆమోదించబోమని స్పష్టం చేసింది. వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది.