ట్రైన్ ఆలస్యమవుతున్న ఘటనలతో నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి 2018లో తన బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ బుక్ చేసుకుంది. బస్తీ జిల్లా నుంచి ఆ రైలు ఉదయం 11 గంటలకు లక్నోకు చేరాల్సిఉండగా రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ లో మధ్యాహ్నం 12.30 గంటల వరకే స్టూడెంట్స్ ను అనుమతించడంతో సమృద్ధి ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆమె లీగల్ ఫైట్ చేసింది. ట్రైన్ లెట్ గా రావడం కారణంగా ఎగ్జామ్ రాయకపోవడంతో తాను ఏడాది కాలాన్ని నష్టపోయానంటూ జిల్లా
వినియోగదారుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమె న్యాయపోరాటానికి విజయం దక్కింది. ట్రైన్ లేటైనందుకు గానూ సదరు విద్యార్థినికి రూ.9.10లక్షల పరిహారం లభించింది. ఈ నష్టానికి గానూ తనకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్ రైల్వే మంత్రిత్వశాఖకు నోటీసులు జారీ చేసింది. అయితే, ట్రైన్ లేట్ ను ధ్రువీకరించిన మంత్రిత్వశాఖ అందుకు గల సరైన కారణాన్ని మాత్రం వెల్లడించలేకపోయింది. దాదాపు ఏడేళ్ల పాటు సాగిన ఈ విచారణలో తాజాగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు విద్యార్థినికి 45 రోజుల్లోగా రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.