శ్రీశైలంలో దర్శనం, అభిషేకాలకు బ్రేక్..
No Darshan on new year at srisailam
జనవరి 1వ తేదీ ఐచ్ఛిక సెలవు రోజు, భక్తుల రద్దీ కారణంగా శ్రీశైల దేవస్తానం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం, ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. భక్తులందరికీ కూడా శ్రీస్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించాలని శ్రీశైల దేవస్థానం నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులందరూ ఈ మార్పును గమనించి సహకరించాలన్నారు. అలాగే ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలు కూడా ఆ రోజున ఉండవన్నారు. క్యూకాంప్లెక్సు లో వేచివున్న భక్తులకు ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం అందజేస్తామన్నారు. ప్రతి భక్తునికి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్తానం ఈవో తెలిపారు.