
Devarakonda Congress party: ఆ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం జరుగుతోందా. రోజురోజుకు రసవత్తరంగా మారుతోన్న అక్కడి రాజకీయం కేవలం ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్ల సమస్యగానే భావించాలా. అలాకాకుండా ఆ జిల్లా రాజకీయాలను శాసించే రెండు బలమైన కుటుంబాల పరోక్ష పాత్ర ఉందా. ఇంతకీ ఆ నియోజక వర్గం ఏంటి. అక్కడ ఏం జరుగుతోంది. వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే బాలునాయక్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే బాలు నాయక్ కు షాకిస్తున్నారట. మాజీ మంత్రులు జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కుటుంబాల పాత్ర, అక్కడి నాయకుల మధ్య ఈ గ్యాప్ కు దారి తీసిందనే చర్చ క్యాడర్ లో జరుగుతుంది. స్థానిక పదవులు, సామాజిక సమీకరణాలు, కాస్ట్ అండ్ క్యాష్ ఈక్వేషన్స్ తెర వెనుక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దేవరకొండ నియోజకవర్గం పేరుకు ఎస్టీలకు రిజర్వ్ అయినప్పటికీ, పెత్తనం మొత్తం ఆ రెండు కుటుంబాల చేతుల్లోనే ఉంటుంది. ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా, ఇక్కడ ఈ వర్గాల హవానే నడుస్తుంది. వారి అండతో అసమ్మతి నేతలు రెచ్చిపోతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, కీలకమైన పదవులు, నామినేటెడ్ పోస్టులు ఆశించిన కొందరు నేతలకు ఎమ్మెల్యే బాలు నాయక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. దీంతో ఇప్పుడు ఎంఎల్ఏ వర్సెస్ లోకల్ లీడర్స్ అన్న చందంగా పరిస్తితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ అంతర్గత పోరుకు కేవలం పదవుల పంచాయితీ మాత్రమే కారణం కాదట. రిజర్వ్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తమ సామాజిక వర్గాన్ని కాదని, కీలకమైన పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్నారన్న ఆవేదన ఒకటైతే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు, కీలక నేతలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు రెండోదిగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశించిన పదవులు దక్కని కొందరు స్థానిక నేతలు ఎమ్మెల్యేను కాదని, జిల్లా సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అసమ్మతి నేతల వ్యవహారం సోషల్ మీడియా దాకా చేరిందట. దీంతో మొదట ఈ తంతును లైట్ తీసుకున్న బాలూనాయక్, ఇప్పుడు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారట. గ్రూప్ రాజకీయాలను సహించనన్న ఆయన, అందుకు బాధ్యులపై చర్యలు తప్పవంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లో క్లారిటీగా చెప్పేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Devarakonda Congress party.
మరో విషయం ఏంటంటే, తానంటే నచ్చని వాళ్లు, పార్టీ మీద ప్రేమలేని కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలంటూ బాలూనాయక్ సూటిగా చెప్పడంతో అసమ్మతి నేతలు షాక్ తిన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్తితులతో కంగుతిన్న దేవరకొండ కాంగ్రెస్ నేతలు, సొంత పార్టీ వారిపైనే ఎంఎల్ఏ కాలుదువ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. పార్టీ అధిష్టానం ఈ పరిస్తితులను చక్కదిద్దాలని సగటు కాంగ్రెస్ కార్యకర్త కోరుతున్నట్లు నియోవకవర్గంలో ప్రచారం జరుగుతోంది.