తిరుప్పరకుండ్రం కార్తీక దీపం ఉత్తర్వులను సమర్ధించిన హైకోర్టు

Spread the love

తమిళనాడు మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాసు హైకోర్టు  డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ కొండపై ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని ఈ సందర్భంగా దీపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. కొండపై దీపం వెలిగించకూడదని ఆగమశాస్త్రంలో ఎక్కడో ఉందో చూపించడంలో పిటిషనర్లు విఫలమయ్యారని కోర్టు గుర్తించింది. బలమైన ఆధారాలు లేనప్పుడు సంప్రదాయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.ఏడాదిలో ఒకరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదం అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. డీఎంకే ప్రభుత్వానికి ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.