అమెరికా లోని ప్రవాస ట్రక్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఉపశమనం

Spread the love

అమెరికా లోని ప్రవాస ట్రక్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఉపశమనం  లభించింది. లైసెన్స్ గడువు తేదీల్లో సమస్యలు ఉన్నాయంటూ కాలిఫోర్నియా ప్రభుత్వం 17 వేల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసింది. దీనిపై ట్రక్ డ్రైవర్లు న్యాయస్థానాన్ని  ఆశ్రయించడంతో ప్రభుత్వం తాజాగా వెనక్కి తగ్గింది. 2026 మార్చి వరకూ ఈ లైసెన్స్ లు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. చట్టబద్ధంగా లైసెన్స్‌ పొందినవారు అప్పటివరకు వాటిని కొనసాగించవచ్చని తెలిపింది.

లైసెన్స్ గడువు తేదీల్లో సమస్యలున్నట్లు గుర్తించిన కాలిఫోర్నియా ట్రాన్స్పోర్ట్  ఏజెన్సీ.. ప్రవాస డ్రైవర్లకు జారీ చేసిన లైసెన్సులు రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించింది. 17,000 మంది డ్రైవర్ల కు వాటిని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది.  ఈ క్రమంలో లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ట్రక్కు డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో  తాజాగా తాత్కాలిక  ఊరట లభించింది.