కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ కొన్ని తేదీలు మాత్రం కాల గర్భంలో చెరగని ముద్ర వేస్తాయి. డిసెంబర్ 31 అనగానే మనందరికీ గుర్తొచ్చేది New Year Eve Celebrations, మందు, విందు, చిందు. నేటి యువత రోడ్ల మీద హంగామా చేస్తూ కనిపిస్తారు. కానీ, ఈ డిసెంబర్ 31 వెనుక ప్రపంచ గమనాన్ని మార్చేసిన గంభీరమైన చరిత్ర ఉంది.సామ్రాజ్యాల పుట్టుక నుంచి.. సైన్స్ అద్భుతాల వరకు.. భయంకరమైన మహమ్మారుల ప్రకటన వరకు.. ఈ తేదీ ఎన్నో మలుపులకు వేదికైంది. అవేంటో Historical Chaptersలో చూద్దాం.
డిసెంబర్ 31 అంటే చాలామంది దావత్ చేసుకుంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అర్ధరాత్రి పూట రోడ్లమీదకి వచ్చి హంగామ చేస్తుంటారు. వాస్తవానికి గతంలో ఇలా ఉండేది కాదు. కొంతకాలంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఫలితంగా డిసెంబర్ 31 అనేది కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే అనే విధంగా మారిపోయింది.డిసెంబర్ 31వ తేదీ కి ప్రపంచ చరిత్ర గతిని మార్చిన సత్తా ఉంది. ఈ తేదీని చరిత్రకారులు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారు. ఇంతకీ ఈ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని అద్భుతాలు.. ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయో ఒకసారి మననం చేసుకుంటే.. వింతగా అనిపిస్తూ ఉంటుంది.
December 31, 1600:
ఆనాడు బ్రిటీష్ వారు చూపిన వ్యాపార ఆశ, మన దేశ గతినే మార్చేసింది.
.ఈ తేదీ భారతీయుల పాలిట ఒక బ్లాక్ డే అని చెప్పవచ్చు. నాడు ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్-1, ఈస్ట్ ఇండియా కంపెనీకి Royal Charter మంజూరు చేశారు. అప్పట్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో డచ్ వారిదే అగ్రస్థానం. వారి Monopolyని దెబ్బకొట్టి, తూర్పు దేశాల్లో వ్యాపారం చేయడమే బ్రిటీష్ వారి అసలు ప్లాన్. Slow and steady wins the race అన్నట్లుగా, కేవలం వ్యాపారం కోసం వచ్చిన వారు.. మెల్లగా మన గడ్డపై పాగా వేశారు. ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ, ఒక దేశాన్నే ఎలా పరిపాలించిందో ఈ తేదీనే పునాది పడింది.
1775 డిసెంబర్ 31:
అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తరుణంలో, కెనడాను కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని పేట్రియాట్ దళాలు ఒక భారీ స్కెచ్ వేశాయి. సరిగ్గా 250 ఏళ్ల క్రితం, అంటే 1775 డిసెంబర్ 31 రాత్రి, మంచు కురుస్తున్న వేళ క్యూబెక్ నగరంపై వారు చేసిన దాడి చరిత్రను మలుపు తిప్పింది. వ్యూహం మరియు నాయకత్వం 1775 నాటికి అమెరికా విప్లవం పీక్ స్టేజ్‌లో ఉంది. కెనడాను బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసి, తమ వైపు తిప్పుకోవాలనేది పేట్రియాట్స్ ప్రధాన Objective. ఈ బాధ్యతను కల్నల్ బెనెడిక్ట్ ఆర్నాల్డ్ మరియు రిచర్డ్ మాంట్గోమెరీ భుజాన వేసుకున్నారు. కానీ, ప్రకృతి మరియు అదృష్టం వారి వైపు లేవు. డిసెంబర్ 31 అర్ధరాత్రి.. భయంకరమైన మంచు తుపాను కురుస్తోంది.
ఆ చీకటిని ఆసరాగా చేసుకుని క్యూబెక్ సిటీని ముట్టడించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ వాతావరణం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. మాంట్గోమెరీ ఒక వైపు నుండి, ఆర్నాల్డ్ మరో వైపు నుండి నగరంపై దాడికి దిగారు. పరాజయం మరియు పరిణామాలు దురదృష్టవశాత్తు, యుద్ధం మొదలైన కొద్దిసేపటికే రిచర్డ్ మాంట్గోమెరీ ప్రాణాలు కోల్పోయారు. బెనెడిక్ట్ ఆర్నాల్డ్ తీవ్రంగా గాయపడ్డారు. నాయకత్వం వహించే వారు లేక, దళాలు చెల్లాచెదురయ్యాయి. కానీ ఇక్కడ లీడర్స్ లేకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. చివరకు పేట్రియాట్ దళాలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఒక చిన్న తప్పు లేదా వాతావరణంలో మార్పు చరిత్రను ఎలా మారుస్తుందో. పేట్రియాట్స్ కు మాత్రం కెనడా విషయంలో ఆ సక్సెస్ దక్కలేదు.
1860 డిసెంబర్ 31
ఒక్కోసారి సముద్రపు లోతుల్లో ఇనుప విగ్రహంలా ఉండిపోతుంది. సరిగ్గా 163 ఏళ్ల క్రితం, ఇదే డిసెంబర్ 31న ఒక వింత యుద్ధనౌక సముద్ర గర్భంలో కలిసిపోయింది. అదే అమెరికా గర్వకారణం.
అది 1860ల కాలం. అప్పటి వరకు యుద్ధనౌకలు అంటే కేవలం చెక్కతో చేసినవి మాత్రమే. కానీ USS మానిటర్ అలా కాదు.అమెరికా అంతర్యుద్ధం సమయంలో శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి దీనిని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఐరన్‌క్లాడ్ (Ironclad) నౌక. అంటే ఇనుప కవచం ఉన్న యుద్ధనౌక. దీని ప్రత్యేకత ఏమిటంటే… నీటి పైన కేవలం ఒక తిరిగే తుపాకీ బురుజు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన బాడీ అంతా నీటి అడుగునే ఉంటుంది.
డిసెంబర్ 1862. వర్జీనియా నుంచి సౌత్ కరోలినాకు మానిటర్ బయలుదేరింది. ఆ సమయంలో వాతావరణం అస్సలు బాలేదు. ఆపరేషన్ ముఖ్యం కాబట్టి ప్రయాణం కొనసాగించారు. ఉత్తర కరోలినాలోని ‘కేప్ హట్టేరాస్’ (Cape Hatteras) ప్రాంతానికి చేరుకోగానే ప్రకృతి తన ప్రతాపం చూపించింది. ఈ ప్రాంతాన్ని అట్లాంటిక్ స్మశానం అని పిలుస్తారు. అక్కడ వచ్చే భారీ కెరటాలకు మానిటర్ తట్టుకోలేకపోయింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి… సముద్రం ఉగ్రరూపం దాల్చింది. , నావికులు నౌకను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ఇనుప కవచమే దానికి శాపమైంది. భారీ గాలులు, ఎగిసిపడుతున్న కెరటాలు నౌక లోపలికి చేరాయి. చివరకు 16 మంది ధైర్యవంతులైన నావికులతో పాటు, ఆ ఇనుప కోట అట్లాంటిక్ లోతుల్లోకి జారిపోయింది. అది నేర్పిన సాంకేతిక పాఠాలు నేటి నౌకాదళాలకు దిక్సూచిగా మారాయి. ఆ వీరుల త్యాగం, ఆ ఇనుప నౌక చరిత్ర ఎప్పటికీ సజీవమే.
1879 డిసెంబర్ 31:.
ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, న్యూజెర్సీలోని మెన్లో పార్క్ ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. అప్పటివరకు మనుషులు కిరోసిన్ దీపాలు, గ్యాస్ లైట్లపై ఆధారపడేవారు. కానీ ఎడిసన్ ఒక Revolutionary ideaతో ముందుకు వచ్చారు. నిజానికి ఎడిసన్ కంటే ముందే చాలామంది బల్బులు తయారు చేసే ప్రయత్నం చేశారు. కానీ అవి ఎక్కువ సేపు వెలిగేవి కావు. ఎడిసన్ వేల సార్లు ఫెయిల్ అయ్యారు. దాదాపు 10,000 సార్లు ప్రయోగాలు విఫలమైనా ఆయన వెనకడుగు వేయలేదు. ఆ రోజు రాత్రి మెన్లో పార్కు వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు రైళ్లలో తరలివచ్చారు. ఎడిసన్ తన ల్యాబొరేటరీ చుట్టూ ఉన్న వీధుల్లో విద్యుత్ దీపాలను అమర్చారు.
ఒక్కసారి ఊహించుకోండి… స్విచ్ వేయగానే చీకటిగా ఉన్న వీధులన్నీ కాంతిమయంగా మారిపోయాయి. ప్రజల కళ్లలో ఆశ్చర్యం. కళ్లముందు జరుగుతున్న ఆ వింతను చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. గ్యాస్ లైట్ల పొగ లేదు, నూనె దీపాల వాసన లేదు… కేవలం స్వచ్ఛమైన వెలుగు. అదే విధంగా ఒక బల్బ్ వెనుక వేల రాత్రుల కష్టం ఉంది. 1879 నాటి ఆ అద్భుత ప్రదర్శనే నేడు మన ఇళ్లలో వెలుగుతున్న ప్రతి లైటుకు పునాది. ఎడిసన్ కనిపెట్టిన ఆ వెలుగు నేటికీ మన జీవితాలను కలర్ఫుల్గా మారుస్తోంది.
1968 డిసెంబర్ 31:
సరిగ్గా 57 ఏళ్ల క్రితం.. అంటే 1968 డిసెంబర్ 31న ప్రపంచం నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమవుతుంటే, సోవియట్ యూనియన్ ఆకాశంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. “Better late than never” అంటారు కదా, కానీ రష్యన్లు మాత్రం బ్రిటన్-ఫ్రాన్స్‌ల కంటే ముందే సూపర్సోనిక్ యుగంలోకి అడుగుపెట్టారు. అదే Tupolev Tu-144! విమానయాన చరిత్రను మలుపు తిప్పిన ఆ అద్భుత ప్రయాణం. 1960వ దశకం అది. అగ్రరాజ్యాల మధ్య ‘కోల్డ్ వార్’ పీక్ స్టేజ్‌లో ఉంది.
కేవలం అంతరిక్షంలోనే కాదు, విమానయాన రంగంలో కూడా తామే నంబర్ వన్ అని నిరూపించుకోవాలని సోవియట్ రష్యా పట్టుదలతో ఉంది. అప్పుడే పుట్టిందే Tu-144. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కలిసి నిర్మిస్తున్న ‘కాన్కార్డ్’ (Concorde) విమానం కంటే ముందే తమ విమానాన్ని గాల్లోకి ఎగరవేయాలని రష్యా భావించింది. అనుకున్నట్టుగానే, 1968 చివరి రోజున, మాస్కో సమీపంలోని జుకోవ్స్కీ ఎయిర్పోర్ట్ నుండి ఈ లోహ విహంగం తొలిసారి నింగిలోకి ఎగిరింది. “సోవియట్ తన పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది.
1972 డిసెంబర్ 31:
1972వ సంవత్సరం.. ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. కానీ, రాబర్ట్ క్లమెంటే మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. నికరాగ్వా (Nicaragua) దేశంలో సంభవించిన భారీ భూకంపం వేల మందిని రోడ్డున పడేసింది. బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఊరికే కూర్చోలేకపోయారు. తన సొంత పర్యవేక్షణలో సహాయక సామాగ్రిని పంపాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 31 రాత్రి, ప్యూర్టో రికా తీరం నుండి ఒక విమానం గాల్లోకి ఎగిరింది. కానీ, దురదృష్టవశాత్తూ అది సముద్రంలో కుప్పకూలిపోయింది.
ఆ ప్రమాదంలో క్లమెంటే భౌతికంగా మనకు దూరమయ్యారు. ఆయన మరణానికి కొద్ది నెలల ముందే, తన కెరీర్లో 3000వ హిట్ సాధించారు. బేస్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. ఆ రికార్డు సాధించిన తదుపరి సీజన్ ఆడకుండానే ఆయన అనంతలోకాలకు వెళ్లిపోవడం క్రీడా ప్రపంచానికి తీరని లోటు.
1984 డిసెంబర్ 31:
డిసెంబర్ 22, 1984. మధ్యాహ్నం సమయం. బెర్న్‌హార్డ్ గోట్జ్ అనే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సబ్వే రైలులో ప్రయాణిస్తున్నాడు. అక్కడ నలుగురు నల్లజాతీయులు అతని దగ్గరికి వచ్చి 5 డాలర్లు ఇవ్వమని అడిగారు. గతంలో ఒకసారి దారుణంగా దోపిడీకి గురైన గోట్జ్, ఈసారి భయపడలేదు. తన దగ్గర ఉన్న అక్రమ రివాల్వర్‌ను తీసి వారందరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల తర్వాత గోట్జ్ అక్కడి నుండి పారిపోయాడు. అమెరికా మీడియా అతనికి The Subway Vigilante అని పేరు పెట్టింది. పోలీసులు అతని కోసం దేశమంతా గాలించారు.
చివరకు, డిసెంబర్ 31న న్యూ హంప్ షైర్ లోని కాంకర్డ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నేనే ఆ షూటర్ని అని లొంగిపోయాడు. గోట్జ్ లొంగిపోయినప్పుడు సగం మంది న్యూయార్కర్లు అతనికి మద్దతు పలికారు. దానికి కారణం.. అప్పట్లో పెరుగుతున్న క్రైమ్ రేట్. ప్రభుత్వం రక్షణ కల్పించలేనప్పుడు మా రక్షణ మేమే చేసుకుంటాం అనే ధోరణి పెరిగింది. Self-help is the best help’ అని ప్రజలు భావించడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పట్టింది.
1985 డిసెంబర్ 31:
1950వ దశకంలో అమెరికాలో ‘రాక్ అండ్ రోల్’ ఒక ప్రభంజనంలా మొదలైంది. ఆ సమయంలో టీవీ తెరపై మెరిసిన ఒక నవ్వు ముఖం.. రిక్ నెల్సన్. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ ఓజీ అండ్ హ్యారియట్’ అనే సిట్కామ్ ద్వారా ఒక సామాన్యుడిలా పరిచయమై, తన గొంతుతో దేశాన్ని ఉర్రూతలూగించారు. టీవీ పాపులారిటీని వాడుకుని, 17 ఏళ్ల వయసులోనే తన మొదటి ఆల్బమ్ విడుదల చేసి మ్యూజిక్ సెన్సేషన్ అయ్యారు. అయితే, ఆయన ప్రయాణం కేవలం సుఖంగా సాగలేదు. రాక్ అండ్ రోల్ నుండి కంట్రీ మ్యూజిక్ వైపు మళ్లుతున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.
ఆ కటిక చీకటి రాత్రి: డిసెంబర్ 31, 1985. రిక్ నెల్సన్ తన బ్యాండ్ ‘స్టోన్ కాన్యన్’ తో కలిసి అలబామా నుండి టెక్సాస్‌కు వెళ్తున్నారు. అక్కడ న్యూ ఇయర్ వేడుకల్లో పర్ఫామ్ చేయాల్సి ఉంది. కానీ విధి మరోలా తలచింది. వారు ప్రయాణిస్తున్న ‘డగ్లస్ DC-3’ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైలట్లు అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది టెక్సాస్‌లోని డీకాల్బ్ సమీపంలో చెట్లను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. కొత్త ఏడాది వేడుకల కోసం వెళ్లిన ఆ గాయకుడు శవమై తిరిగివచ్చారు.
1999 డిసెంబర్ 31:
రెండు మహా సముద్రాలను కలిపే వంతెన.. ప్రపంచ దేశాల వ్యాపార సామ్రాజ్యానికి ఒక ఆయువుపట్టు.. అదే పనామా కాలువ. ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అంటారు కదా, కానీ ఒక చిన్న దేశం తన హక్కుల కోసం అగ్రరాజ్యంతో చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. సరిగ్గా 26 ఏళ్ల క్రితం, అంటే డిసెంబర్ 31, 1999న ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 85 ఏళ్ల తర్వాత పనామా కాలువపై అమెరికా పెత్తనం ముగిసింది.
పనామా కాలువ.. ఇది కేవలం నీటి మార్గం కాదు, మానవ మేధస్సుకు ఒక నిదర్శనం. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఈ 82 కిలోమీటర్ల కాలువ వల్ల వేల మైళ్ల ప్రయాణ దూరం తగ్గిపోయింది. అయితే, ఈ కాలువ నిర్మాణం వెనుక ఎంతో రక్తం, కష్టం ఉన్నాయి. 1914లో అమెరికా దీని నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటి నుండి, ఆ కాలువ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతం (Canal Zone) పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉండేది.1964లో జరిగిన అల్లర్ల తర్వాత, అమెరికా తన ధోరణిని మార్చుకోవాల్సి వచ్చింది. 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరియు పనామా నాయకుడు ఒమర్ టోరిజోస్ మధ్య ‘టోరిజోస్-కార్టర్ ఒప్పందం’ కుదిరింది.
డిసెంబర్ 31, 1999. మధ్యాహ్నం 12 గంటల సమయం. పనామాలోని ‘మిరాఫ్లోర్స్ లాక్స్’ వద్ద ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా జెండా దిగిపోయింది.. పనామా జెండా సగర్వంగా ఎగిరింది. ‘Every cloud has a silver lining’ అన్నట్లుగా, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పనామాకు తన సొంత కాలువపై పూర్తి అధికారం లభించింది. అమెరికా సైన్యం ఆ ప్రాంతం నుండి నిష్క్రమించింది. అప్పటి నుండి నేటి వరకు ‘పనామా కెనాల్ అథారిటీ’ (ACP) దీనిని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
2019 డిసెంబర్ 31:
డిసెంబర్ 31, 2019. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా, చైనాలోని ఊహాన్ అధికారులు ఒక అసాధారణమైన ‘న్యూమోనియా’ వ్యాప్తి చెందుతోందని ప్రకటించారు. “ముందు జాగ్రత్త లేని చోట.. ముప్పు పొంచి ఉంటుంది” అన్నట్టుగా, ఈ వైరస్ కేవలం కొద్ది రోజుల్లోనే సరిహద్దులు దాటింది. చైనా నుంచి థాయ్‌లాండ్, జపాన్, అమెరికా.. ఇలా దేశాలన్నీ ఈ వైరస్ గుప్పిట్లోకి వెళ్లాయి. దీని తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30, 2020న దీనిని Public Health Emergencyగా ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 11న దీనిని మహమ్మారి గా ఖరారు చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ దేశాల ముందు ఉన్న ఏకైక మార్గం ‘లాక్డౌన్’. “ఇల్లు ఈడ్చి వాకిట్లో పారేసినట్టు”.. జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చివరిగా.. కోవిడ్ 19 చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారులలో ఒకటిగా నిలిచిపోయింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్, మానవ మనుగడకు పెను సవాలు విసిరింది.
డిసెంబర్ 31 అంటే కేవలం పార్టీలు, సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. ఇందులో యుద్ధాలు ఉన్నాయి, ఆవిష్కరణలు ఉన్నాయి, రాజకీయ మలుపులు ఉన్నాయి, మరియు గుండెను పిండేసే విషాదాలు కూడా ఉన్నాయి. చరిత్రను చదవడం అంటే గతాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించుకోవడం కూడా. ‘History repeats itself’, కాబట్టి ఈ తేదీ ఇచ్చే పాఠాలను మనం గుర్తుంచుకోవాలి.