యష్ ‘టాక్సిక్’ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్ విడుదల!

Spread the love

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘టాక్సిక్’ (Toxic) నుండి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార పోషిస్తున్న ‘గంగ’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు.ఒక భారీ క్యాసినో నేపథ్యంలో, చేతిలో గన్ పట్టుకుని అత్యంత స్టైలిష్‌గా నడుస్తూ…తీక్షణమైన చూపులతో నయనతార కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ పాత్ర నయనతార కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఆమె వ్యక్తిత్వానికి ఈ పాత్ర ఆత్మ చాలా దగ్గరగా ఉంటుందని దర్శకురాలు పేర్కొన్నారు.ఈ చిత్రంలో  కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి స్టార్స్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.యష్ & వెంకట్ కే నారాయణ లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రాన్ని ఉగాది లేదా ఈద్ కానుకగా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.