భారత మాజీ క్రికెటర్,మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రికి ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో అరుదైన గౌరవం లభించింది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ).. స్టేడియంలోని ఒక స్టాండ్ కు రవిశాస్త్రి పేరు పెట్టింది. భారత మాజీ క్రికెటర్లు ఏక్నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీలను కూడా ఎంసీఏ సముచిత గౌరవం అందించింది. వాంఖడే స్టేడియంలోని గేట్లకు వారి పేర్లను పెట్టింది. సోల్కర్, సర్దేశాయ్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల బాలుడిగా వాంఖడేలో తొలిసారిగా అడుగుపెట్టినట్లు తెలిపాడు. తన తల్లికి క్రికెటంటే ఎంతో ఇష్టమని తన పేరుతో వాంఖడేలో స్టాండ్ వస్తుందని తెలిసి తన తల్లి ఎంతో గర్వించిందన్నారు. నా మ్యాచ్లు చూసేందుకు కుటుంబమంతా చాలా ఏళ్లపాటు స్టేడియానికి వచ్చింది. అయితే ఒకానొక దశలో స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. దీంతో మనస్తాపం చెందిన మా నాన్న ‘నేను మళ్లీ రానని అన్నారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ రాలేదు అనంతరం భారత జట్టుకు కోచ్ గా సేవలందించాను. వెక్కిరించిన వాళ్లే ఆ తర్వాత నన్ను ప్రశంసించారు. వాంఖడేలో బరోడాపై ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సర్లు తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని రవిశాస్త్రి తెలిపారు.