వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ భువనేశ్వర్ వేదికగా జరగనుంది. తాజాగా పోలెండ్లో సమావేశమైన ప్రపంచ అథ్లెటిక్స్ బోర్డు ప్రతిష్ఠాత్మక పోటీల హోస్టింగ్ రైట్స్ ను భారత్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఆతిథ్య హక్కుల్ని భారత్ కు కేటాయించినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలా తెలిపారు. వరల్డ్ టోర్నీ హోస్టింగ్ కోసం ఈ ఏడాది ఆరంభంలో బిడ్ దాఖల చేసినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ తెలిపింది. ఇంటర్నేషనల్ స్థాయిలో పెరుగుతున్న భారత అథ్లెటిక్స్ కీర్తికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్, వరల్డ్ ప్లాట్ ఫామ్ ల పై స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మెడల్స్ సాధించిన తర్వాత భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్స్ పై ఆసక్తి పెరుగుతోంది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం సముదాయంలోని అడ్వాన్స్డ్ ఇండోర్ సెంటర్ ను వరల్డ్ అథ్లెటిక్స్ టీమ్ ఇప్పటికే పరిశీలించింది.