ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనడంపై స్పష్టతనిచ్చిన ఇరాన్

Spread the love

మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఆడుతుందా అనే సందిగ్దత నేపథ్యంలో ఇరాన్ దీనిపై స్పష్టతనిచ్చింది. ఫిఫా వరల్డ్-2026కు సంబంధించి ఇరాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. టోర్నీ నుండి  వైదొలిగే ఉద్దేశం తమకు లేదన్న ఎఫ్ఎఫ్ఎస్ఐ.. అమెరికా లో జరిగే తమ గ్రూపు దశ మ్యాచ్లను మాత్రం బహిష్కరించాలని నిర్ణయించుకుంది. షెడ్యూల్ ప్రకారం అమెరికాలో జరిగే  తమ మ్యాచ్ లను మరో మార్గంగా  మెక్సికోకు మార్చాలని ఎఫ్ఎఫ్ఎస్ఐ చీఫ్ మెహదీ తాజ్ విజ్ఞప్తి చేశాడు.  2026 జూన్ 11 నుండి  జులై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాలలో ఈ మెగా టోర్నీ జరగనుంది.  తమ మూడు గ్రూప్ మ్యాచ్లను మెక్సికోలో నిర్వహంచేలా ఫిఫాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మెహదీ తెలిపాడు.  గ్రూప్ దశలో న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్టతో ఇరాన్ తలపడే మ్యాచ్లకు ఆతిథ్యమివ్వడానికి తాము రెడీగా ఉన్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్బామ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వేదిక మార్పుపై తుది నిర్ణయం ఫిఫాదే అని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుతం ఇరాన్ నేషనల్ టీమ్  తుర్కియేలో ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొంటోంది. వరల్డ్ కప్  సన్నాహాల్లో భాగంగా ఈ నెలాఖరులో నైజీరియా, కోస్టారికాలతో మ్యాచ్ లు  ఆడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *