అలనాటి  క్రికెటర్ గోపీనాథ్ కన్నుమూత 

Spread the love

భారత క్రికెట్ లో మొదటి జెనరేషన్ క్రికెటర్ చింగల్ పుట్ దొరైకన్ను గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు. 1951లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అరంగ్రేటం చేశారు. భారత్ తరపున 8 టెస్టులు ఆడిన ఆయన 22 యావరేజ్ తో 242 రన్స్ చేశారు. మొదటి టెస్టు విజయంలో ఆయన కూడా ఉన్నారు. దేశవాళీ క్రికెట్ లో మద్రాస్ కు ఆడిన గోపీనాథ్ 83 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో 42.16 యావరేజ్ తో 4259 పరుగులు చేశారు. 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించారు. బౌలింగ్ లోనూ 14 వికెట్లు పడగొట్టారు. 1960లో చివరి టెస్టు ఆడారు. 96 సంవత్సరాల గోపీనాథన్ అత్యంత రెండో వయసుగల క్రికెటర్ గా కొనసాగారు. ఆయన అనంతరం ముంబైకి చెందిన చంద్రకాంత్ పతాంకర్ (95) ఎక్కువ వయసు ఉన్న క్రికెటర్ గా కొనసాగుతున్నారు. బ్రతికి ఉన్న మాజీ క్రికెటర్లలో  ఆస్ట్రేలియా దిగ్గజం నీల్ హార్వే 97 సంవత్సరాలతో ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *