8 నెలల గర్భంతో బరిలోకి దిగి..మెడల్స్ తో సత్తా చాటిన మేఘన సజ్జనార్

Spread the love

మేఘన సజ్జనార్ ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటింది. 8నెలల గర్భవతిగా ఉండి బరిలోకి దిగడమే కాకుండా మెడల్స్ తో అదరగొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో వ్యక్తిగత విభాగంలో బ్రాన్జ్ మెడల్ కైవసం చేసుకోవడమే గాక టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ప్రశంసలు అందుకుంటోంది. కర్ణాటకకు చెందిన ఈ 32 ఏళ్ల షూటర్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కొందరు అథ్లెట్స్ ఒలింపిక్ లో కూడా గర్భవతులుగా ఉండి బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. ప్రసవించే వరకు ఆడొచ్చు అని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ధైర్యంగా షూటింగ్ లో కొనసాగినట్లు తెలిపారు. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. బిడ్డకు జన్మనిచ్చాక సెప్టెంబర్ లో ఆసియా క్రీడల సమయానికి తిరిగి సత్తాచాటాలని మేఘన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.