వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్-6 హామీలు నెరవేర్చలేకపోయినా.. సూపర్ హిట్ అంటూ అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబుబాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. స్టేడియాల్లో జాల్సాలు చేస్తూ సంబరాలా రాత్రికి కొలంబోలో.. మరుసటి రోజు ఉదయం విజయవాడలో.. మళ్లీ సాయంత్రానికి ఢిల్లీకి దేశంలో ఎవ్వరైనా ఇలా ప్రజల డబ్బుతో జల్సాలు చేసే వాళ్లు ఉంటారా? అని లోకేష్ పై విమర్శలు చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజల సొమ్ముతో జల్సాలు చేసే చెత్త ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆదాయం పెరిగింది అంటూ చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే! మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే అది చంద్రబాబే. అబద్ధానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబే” అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను మూడు బడ్జెట్‌లలోనూ గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని జగన్ ఆరోపించారు. మహిళలకు రూ.1,500, నిరుద్యోగ భృతి వంటి హామీలకు నిధుల కేటాయింపు ఏదని ప్రశ్నించారు.