లక్ష్యసేన్  క్వార్టర్ ఫైనల్ లో పరాజయం

Spread the love

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత్ తన పోరాటాన్ని ముగించింది.  స్టార్ షట్లర్ లక్ష్యసేన్  క్వార్టర్ ఫైనల్ లో పరాజయం చెందాడు. తాజాగా జరిగిన  పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో లక్ష్యసేన్ 21-17, 13-21, 18-21తో చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్  చేతిలో ఓటమి చెందాడు. ప్రిక్వార్టర్స్లో కిదాంబి శ్రీకాంత్ 14-21, 21-17, 17-21తో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో పొపోవ్ చేతిలో, హెచ్.ఎస్.ప్రణయ్ 21-18, 19-21, 14-21తో లో సింగపూర్ కు చెందిన  కీన్ యు చేతిలో పరాజయం  పాలయ్యారు. టై ఫేవరెట్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్- చిరాగ్ జోడీ 27-25, 21-23, 19-21తో జపాన్ కు చెందిన  హిరోకి మిదొరికవా- కొహె యమషిత  జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ 22-20, 22-24, 21-23తో చైనా ద్వయం  లీ యిజింగ్- లూ షుమిన్ చేతిలో పరాజయం ఓటమి చెందారు.