ప్రపంచ బ్లిట్జ్ చెస్ లో కూడా దూసుకుపోతున్న అర్జున్

Spread the love

ఇటీవల జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో బ్రాంజ్ మెడల్ తో సత్తా చాటిన  భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి.. ప్రపంచ బ్లిట్జ్ చెస్ కూడా దూసుకుపోతున్నాడు. 13 రౌండ్లు ముగిసే సరికి 10 పాయింట్లు సాధించి వాచీర్ లాగ్రేవ్ (10, ఫ్రాన్స్), కరువానా (10, అమెరికా)తో కలిసి టాప్ లో నిలిచాడు. 8 గేముల్లో గెలిచిన అర్జున్.. నాలుగింటిని డ్రాగా ముగించాడు. ఒక గేమ్లో పరాజయం చెందాడు. అర్జున్ తొమ్మిదో రౌండ్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్ సన్  (నార్వే)పై గెలవడం గమనార్హం. 

కార్ల్ సన్  ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్నాడు. నారాయణన్ (9) సంయుక్తంగా  మూడో స్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద ఏడు విజయాలు, నాలుగు డ్రాలు, రెండు ఓటములతో 9 పాయింట్లు సాధించాడు. గుకేశ్ 8.5 పాయింట్లతో ఉన్నాడు. టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీ ఫైనల్ కు క్వాలిఫై అవుతారు. మహిళల విభాగంలో 10 రౌండ్లు ముగిసే సరికి ఫ్రాన్స్కు చెందిన రోబర్స్ ఎలీన్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దివ్య (6 పాయింట్లు), హంపి (5 పాయింట్లు), హారిక (5.5), వైశాలి (5.5) ఉన్నారు. మహిళల విభాగంలో మరో 5 రౌండ్లు ఆడాలి. తర్వాత సెమీ ఫైనల్స్ ఉంటాయి.