టీ20 వరల్డ్ కప్ లో భారత్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత

Spread the love

వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంక ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. కాగా, భారత్ లో మ్యాచ్ లు  ఆడేందుకు బంగ్లాదేశ్ తిరస్కరించింది. తమ మ్యాచ్లను మరో దేశంలో నిర్వహించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విజ్ఞప్తి చేసింది. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ తమ టీమ్ నుంచి విడుదల చేసింది. ఆ తర్వాతి రోజే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ లో పర్యటించకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  నిర్ణయించుకుంది. గత 24 గంటల్లో పరిణామాలను పరిగణనలోకి తీసుకుని తాజా పరిస్థితులను బోర్డు సమీక్షించింది. బంగ్లాదేశ్ బృందం సెక్యూరిటీపై  ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వ సలహా ప్రకారం టీ20 ప్రపంచకప్ కోసం జట్టును భారత్ కు  పంపరాదని నిర్ణయించిందని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. “ప్రపంచకప్ లో తాము ఆడే మ్యాచ్ లను మరో దేశానికి (శ్రీలంక) తరలించాలని ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసిందని తెలిపింది.