ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆ ఆ టీమ్ మూడో ఓటమిని మూటగట్టుకుంది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 43 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టిమ్ డేవిడ్ 70 నాటౌట్ (25; 3×4, 8×6) విధ్వంసక ఇన్నింగ్స్ తో చెలరేగాడు. దేవ్ దత్ పడిక్కల్ 50 (29; 5×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రజత్ పటిదార్ 48 (19; 1×4, 6×6) బ్యాట్ ఝళిపించాడు. విరాట్ కోహ్లీ 28 (18;2 x4,1×6) పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జెమీ ఓవర్టన్, శివమ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై కూడా ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. సంజు శాంసన్ (9), రుతురాజ్ గైక్వాడ్ (7), ఆయుష్ మాత్రే (1) ఘోరంగా విఫలమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ 50 (25; 8×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రశాంత్ వీర్ 43 (29; 6×4, 1×6), జెమీ ఓవర్టన్ 37 (16; 4×4, 2×6) పరుగులు చేయడంతో చెన్నై కూడా 207 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, జాకబ్ డఫీ 2వికెట్లు, అభినందన్ సింగ్ 2 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, సుయాష్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత అందుకున్నాడు. 200 ఐపీఎల్ వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.