భారత్ జట్టుపై మాజీ కెప్టెన్ ప్రశంశలు

Spread the love

మరికొన్ని గంటల్లోనే టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మన జట్టుపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టని పేర్కొన్నాడు. టీమ్ లోని మెంబర్స్ కు ఎవరు ఏ పాత్ర పోషించాలో స్పష్టంగా తెలుసనీ అన్నాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత్ కు ఉందని ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాడు. ఒక మంచి జట్టుకు ఏమేం కావాలో అవన్నీ భారత జట్టులో ఉన్నాయని ప్రశంసించాడు. టీమ్ లోని సభ్యులకు అనుభవం ఉంది. ఈ ఫార్మాట్ లో అదే కీలకం. వారు ఒత్తిడిని జయించగలరు. ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేయాలో తెలుసన్నాడు. అలాగే మంచు ప్రభావం (డ్యూ ఫ్యాక్టర్) పైనా ధోని మాట్లాడాడు. డ్యూ చాలా విషయాలను ప్రభావితం చేస్తుందన్నాడు. డ్యూ పట్ల తను ఆడుతున్నప్పుడు కూడా  ఆందోళనకు గురైనట్లు తెలిపాడు. అయితే టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు.