SFDR సాంకేతికతను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

Spread the love

భారత్ తన రక్షణా రంగ సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటూ మరీ ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలను సుసాధ్యం చేస్తోంది.ఇక ఇటువంటి సాంకేతికతల అభివృద్ధిలో భారత రక్షణా రంగ పరిశోధనా సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక తాజాగా నేడు సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) సాంకేతికతను నేడు ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి విజయవంతంగా పరీక్షించారు. సుదూర లక్ష్యాలను ఛేదించే ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే క్షిపణుల (Air to Air Missiles) అభివృద్ధిలో SFDR అత్యంత కీలకమైనది. SFDR అంటే ఇది క్షిపణి ఇంజన్ సాంకేతికత. సాధారణ రాకెట్లలా కాకుండా, ఇది గాలిలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని ఇంధనాన్ని మండిస్తుంది, దీనివల్ల క్షిపణి బరువు తగ్గి ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది.