ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలుపు

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుని పాయింట్ల ఖాతా తెరిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 70 (45; 4×4, 5×6), జాస్ బట్లర్ 52 (27; 3×4, 5×6), వాషింగ్టన్ సుందర్ 55 (32; 6×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా..లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఢిల్లీ కూడా మంచి పోరాటాన్ని కనబరిచింది. నిస్సంకా 41 (24; 6×4, 1×6) ధాటిగా ఆడాడు. కే.ఎల్.రాహుల్ 92 (52; 11×4, 4×6) మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 41 నాటౌట్ (20; 3×4, 3×6) పరుగులతో చివరి వరకు పోరాడాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో మ్యాచ్ ను ఒక్క పరుగు తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *