మిథాలీ రాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  రికార్డును సమం చేసిన హర్మన్ ప్రీత్ 

Spread the love

భారత మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ల రికార్డులను  ప్రస్తుత క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సమం చేసింది. తాజాగా శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరిగిన అయిదో టీ20 మ్యాచ్ అనంతరం హర్మన్ ఈ ఫీట్ సాధించింది.  ఈ మ్యాచ్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. హర్మన్ మాత్రం హాఫ్ సెంచరీ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఆమె దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. 

ఇక మిథాలీరాజ్ 1999 నుంచి 2022 వరకు సుదీర్ఘంగా 23 సంవత్సరాల వరకు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 89 టీ20 మ్యాచ్లు ఆడింది. 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ 187 టీ 20 మ్యాచుల్లో 12 ప్లేయర్ ఆఫ్ మ్యాచ్లు సాధించింది. దీంతో మిథాలీ రికార్డ్ ను హర్మన్ ప్రీత్ సమం చేసింది. మిథాలీ ఈ ఫార్మాట్ లో  2,364 రన్స్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటివరకు 3,784 రన్స్ చేసింది.