హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలు…పోలీసుల ఆంక్షలు ఇవే…!

Spread the love

భాగ్యనగరంలో 2026 నూతన సంవత్సర వేడుకల కోసం పోలీసులు భారీ భద్రత , పాటుగా కఠినమైన ఆంక్షలను అమలులోకి తెచ్చారు.నగరంలోని అన్ని పబ్బులు, క్లబ్బులు , ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట (1:00 AM) వరకు మాత్రమే అనుమతి ఉండగా, ఆ తర్వాత మ్యూజిక్ పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది.రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు బేగంపేట, లంగర్ హౌస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. తాగి వాహనం నడిపి పట్టుబడితే ₹10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్షతో పాటు లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు.ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడుస్తుండగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది, అయితే మద్యం సేవించిన వారికి వీటిలో ప్రవేశం లేదు. 

ఈవెంట్ ఆర్గనైజర్లు డ్రగ్స్ రహిత వేడుకలు నిర్వహించాలని,సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేయాలని పోలీస్ కమిషనర్లు స్పష్టం చేశారు.ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా డ్రగ్స్ వాడినా ఆ సంస్థల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతటా వందలాది చోట్ల చెక్‌పోస్టులు, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు.వేడుకల పేరుతో అతివేగంగా వాహనాలు నడిపినా, బైక్ రేసింగ్‌లకు పాల్పడినా వాహనాలను స్పాట్‌లోనే సీజ్ చేస్తారు. కాబట్టి, నగరవాసులు పోలీసుల నిబంధనలు పాటిస్తూ…సురక్షితంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని అధికారులు సూచించారు.