సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ లో సత్తాచాటడడంతో 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 53 (20 బాల్స్; 2×4, 7×6), తిలక్ వర్మ 45(19; 3×4, 3×6), అక్షర్ పటేల్ 35 నాటౌట్ (23; 2×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ 30 (16; 2×4, 2×6), హార్దిక్ పాండ్య 30 (10; 2x3x6), అభిషేక్ శర్మ 24 (18; 3×4, 1×6) పరుగులు చేయడంతో భారత్ 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. స్టబ్స్ 45 నాటౌట్ (21; 4×4, 3×6) రాణించాడు. అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు.