అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్

Spread the love

అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ అంచనాలకు తగ్గట్లుగానే విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగులు చేసింది. షినోజాదా 110,ఉజైరుల్లా 101 నాటౌట్,  ఉస్మాన్ సాదత్ 39, కుండు 31 పరుగులు చేయడంతో భారీ టార్గెట్ ను భారత్ ముందుంచింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 2వికెట్లు, కనిష్క్ చౌహన్ 2వికెట్లు పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 41.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోన్ జార్జ్ 115, వైభవ్ 68, మాత్రే 62, విహన్ 38 నాటౌట్ పరుగులు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో వహీదుల్లా 1 వికెట్, నూరిస్తాని 2 వికెట్లు పడగొట్టారు.