టీ 20 వరల్డ్ కప్ సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ జింబాబ్వే పై 72 పరుగులతో భారీ విజయాన్ని సాధించి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 55 (30; 4×4,4×6), సంజూ శాంసన్ 24 (15; 1×4, 2×6), ఇషాన్ కిషన్ 38 (24; 4×4, 1×6), సూర్యకుమార్ యాదవ్ 33 (13; 3×4, 2×6), హార్దిక్ పాండ్య 50 నాటౌట్ (23; 2×4, 4×6), తిలక్ వర్మ 44 నాటౌట్ (16; 3×4, 4×6) పరుగులు చేశారు. దీంతో భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందుంచింది. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, రిచర్డ్, మపొసా, సికందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. టార్గెట్ ఛేజింగ్ లో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్ (59; 8×4, 6×6) మంచి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సికందర్ రజా (31), మరుమని (20) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్,శివమ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. అయితే భారత బౌలింగ్ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.