మరో నాలుగు రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సర్వత్రా చర్చకు తెరలేపింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల వైఖరిపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో పర్యటించమని చెప్పడంతో టోర్నీ నుండి ఔటయింది. ఇక పాకిస్థాన్ న్యూట్రల్ వెన్యూలో కూడా భారత్ తో మ్యాచ్ ఆడమని చెప్పడం వివాదాస్పదమవుతోంది. దీనికి ఎటువంటి కారణం కూడా చూపకపోవడం మరింత విమర్శలకు తావిస్తోంది. దీనిపై భారత మాజీ క్రికెటర్లు సైతం తమదైన రీతిలో స్పందించారు. ఐసీసీ పాకిస్థాన్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని బ్యాన్, ఫైన్స్ పడవచ్చని అలాగే ఇకపై పాకిస్థాన్ ఏ ఐసీసీ టోర్నమెంట్ కూ ఆతిథ్యం ఇవ్వలేకపోవచ్చని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. పాక్ తనకు తానే నష్టం చేసుకుంటోందని మరొక మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు. నాకౌట్ లో కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగదా…అది వరల్డ్ టీ 20 బైలాగా ఉంటుందా? అని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నాడు.